సుభాష్‌నగర్: జిల్లాలోని ఆలయాల పరిరక్షణకు కృషిచేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో గురువారం బీజేపీ అధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో చారిత్రాత్మక ఆలయాలు ఎన్నో ఉన్నాయని, వాటి భూముల పరిరక్షణకు నూతనంగా ఏర్పడిన ఆధ్యాత్మిక సెల్ కృషి చేయాలన్నారు. ఆలయాలపై జరిగే దాడులు, వ్యతిరేక కార్యకలాపాలను ఎదిరించి ఆసరాగా నిలవాలని సూచించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్ర కన్వీనర్ సూర్యప్రకాష్‌రావు, కోకన్వీనర్ నిరంజన్ దేశాయ్, జాయింట్ కన్వీనర్ నవీన్, జిల్లా కన్వీనర్ మేఘా సుబేదార్, రాష్ట్ర సలహాదారు ఉదయ్‌మహరాజు, జిల్లా కోకన్వీనర్ రాజేష్, చంద్రకాంత్ పాల్గొన్నారు.


