కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లా అండర్–14 బాలురు,బాలికల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించగా వందలాది క్రీడాకారులు ఉత్సహంగా పాల్గొన్నారు. రన్నింగ్, త్రోస్, లాంగ్‌జంప్, షాట్‌ఫుట్, డిస్కస్‌త్రో పోటీ లు, ఎంపికలు నిర్వహించారు. విజేతలకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపికై న క్రీడాకారులు హనుమకొండలో ఈనెల 10, 11వ తేదీల్లో నిర్వహించే ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు రసూల్, హీరాలాల్, అనిల్‌కుమార్, శ్రీనివాస్ విజయ, అరుణ, రేణుక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఎంపికై న క్రీడాకారులు


