పేదలను ఆదుకునేందుకే సంక్షేమ పథకాలు | - | Sakshi
Sakshi News home page

పేదలను ఆదుకునేందుకే సంక్షేమ పథకాలు

Oct 28 2026 1:36 AM | Updated on Oct 28 2026 1:36 AM

రెంజల్‌ : పదేళ్లలో కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే పేదలను ఆదుకునేందుకు అవసరమైన సంక్షేమ పథకాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని ప్రభుత్వ ప్రధాన సలహాదారు, బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రెంజల్‌ మండలం సాటాపూర్‌లో మంగళవారం విండో చైర్మన్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ చేయలేని పనులను కాంగ్రెస్‌ చేస్తుందని వివరించారు. కొత్తగా రేషన్‌కార్డులను అందించడమే కాకుండా సన్నబియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పేదలకు నాణ్యమైన కార్పొరేట్‌ విద్యను అందించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రభుత్వ పాఠశాలను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. అనంతరం మండలంలోని 70 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను సుదర్శన్‌రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు మండలంలోని రెంజల్‌, నీలా, దూపల్లి సహకార సంఘాల చైర్మన్లు సాయరెడ్డి, జావిదొద్దీన్‌, రాములు, డైరెక్టర్లతో జిల్లా సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ రమాలత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మొబిన్‌ఖాన్‌, సర్పంచ్‌లు సుహాసిని, నర్సవ్వ, భానుచందర్‌, ధనుంజయ్‌, గయాజొద్దీన్‌, జుబేర్‌, అశోక్‌నాయక్‌, మల్లేశ్‌, సునీత, విజయ్‌, తెలంగాణ శంకర్‌, మాదవ్‌, మాజీ జెడ్పీటీసీ నాగభూషణంరెడ్డి, మహిళా కాంగ్రెస్‌ మండల అధ్యక్షురాలు ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్‌ చేసిన అప్పులకు వడ్డీలు

చెల్లిస్తూ కొత్త పథకాల అమలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌ రెడ్డి

మూడు పీఏసీఎస్‌ల చైర్మన్లు,

డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement