● గాలింపు చేపట్టిన గజ ఈతగాళ్లు
● మెదక్ జిల్లా కొల్చారం
శివారులో ఘటన
ఎల్లారెడ్డి: మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన తల్లి, ఇద్దరు కూతుళ్లు మెదక్ జిల్లా కొల్చా రం మండల శివారులోని మంజీరా నదిలో గల్లంతయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ గ్రామానికి చెందిన సరిత(30) తన భర్త మృతి చెందడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు కంపెనీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. తన ఇద్దరు కూతుళ్లు వైష్ణవి (8), సంగీతిక (6)ను తల్లిదండ్రుల వద్ద ఉంచింది. సోమవారం హైదరాబాద్ నుంచి వచ్చిన సరిత ఇద్దరు కూతుళ్లను తీసుకొని ఆధార్ కార్డుల పనుల కోసం కామారెడ్డికి వెళ్తున్నానని చెప్పింది. మంగళవారం సరిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఏడుపా యలకు వచ్చి తాను చనిపోతున్నట్లు తండ్రి బాలకృష్ణయ్యకు ఫోన్ చేసింది. దీంతో వెంటనే ఆయన ఎల్లారెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో వారు మెదక్ జిల్లా కొల్చారం పోలీసులను అప్రమత్తం చేశారు. మెదక్ రూరల్ ఎస్సై, సిబ్బందితో కలిసి సరిత మొబైల్ లొకేషన్ ఆధారంగా నది వెంట గాలిస్తుండగా, మొదటి బ్రిడ్జి నది ఒడ్డున మొ బైల్ ఫోన్, ఆధార్ కార్డులు, చెప్పులు కనిపించా యి. దీంతో మెదక్ నుంచి అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ లభించక చీకటి పడడంతో గాలింపును ఆపివేశారు. బుధవారం ఉదయం మరోసారి గాలింపు చర్యలు చేపడతామని ఎస్సై తెలిపారు.


