● అసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాస్ రావు
● యువ ఆపద మిత్ర రెండో బ్యాచ్
శిక్షణ ప్రారంభం
డిచ్‌పల్లి: ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు తక్షణ సహాయం అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ అసిస్టెంట్ క మాండెంట్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. డిచ్‌పల్లి లోని ఏడో బెటాలియన్‌లో మంగళవారం యువ ఆ పదమిత్ర రెండో బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమాండెంట్ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో సమర్థవంతంగా స్పందించేలా యువతను తీర్చిదిద్దుతా మని తెలిపారు. యువ ఆపదమిత్రతో యువతలో సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. శిక్షణకు మొత్తం 176 మంది విద్యార్థులు హాజరయ్యారు. కేటీ విజయ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ ఇన్‌చార్జి శ్రీనివాస్, తెలంగాణ యూ నివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనుపమ, అధికారులు పాల్గొన్నారు.


