డొంకేశ్వర్(ఆర్మూర్): మండల పరిధిలోని నూత్‌పల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. మంగళవారం రథోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చి న కలెక్టర్‌కు అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించగా, అర్చకులు తీర్థప్రసాదాలు అందించి వేదాశీర్వచనం చేశారు.
నిజామాబాద్ రూరల్: నగరంలోని వినాయక్‌నగర్‌లో ఉన్న త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌లో మంగళవా రం 51వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా యజమానులు కొండ శ్రావణ్‌కుమార్, కొండ పవన్‌కుమార్‌లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ త్రిమూర్తి ఎంటర్‌ప్రైజెస్‌ను 1975 అక్టోబర్ 27న జిల్లా కేంద్రంలో కొండ వీరశేఖర్ గుప్తా ప్రారంభించారన్నారు. ప్రజల ఆదరణ పొందుతూ ప్రస్తుతం హైద రాబాద్ రోడ్‌లో సొంత భవనంలో పెద్ద షోరూమ్ గా అభివృద్ధి చెందినట్లు తెలిపారు. సొంత మ్యానుఫ్యాక్చర్ ఐరెస్ట్ చైర్స్, కూలర్స్‌ను అతి తక్కువ ధరల్లో అందిస్తున్నట్లు తెలిపారు.
పెర్కిట్(ఆర్మూర్): పెర్కిట్ కేజీబీవీలో హెడ్ కుక్, అడిషనల్ కుక్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎస్‌వో గంగామణి మంగళవారం తెలిపారు. హెడ్ కుక్ పోస్టుకు 10వ తరగతి, అడిషనల్ కుక్ పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులైన మహిళలు అర్హులని పేర్కొన్నారు. అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలు, పీపీ సైజ్ ఫొటో నవంబర్ 2వ తేదీలోగా పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


