సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేసేందుకు ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంగీకారం తెలిపారని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలసి పీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధుల పై చర్చించారు. జిల్లాలో అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతి వివరాలను సీఎం తెలుసుకున్నారు. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని మాధవనగర్‌తోపాటు అర్సపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేసేందుకు అవసరమైన నిధుల కేటాయింపు అంశాన్ని నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి ఆనుకుని ఉన్న కీలకమైన ఈ రెండు బ్రిడ్జిల నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యం మెరుగుపడటంతోపాటు ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని సీఎంకు వివరించారు. స్పందించిన సీఎం.. మాధవనగర్, అర్సపల్లి ఓవర్ బ్రిడ్జి నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని మహేశ్‌కుమార్‌గౌడ్, సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశమైన వారిలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాట్‌పల్లి నగేశ్‌రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, శేఖర్‌గౌడ్, మానాల మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్‌చార్జీలు సునీల్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏబీ చిన్నా, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి ఉన్నారు.
మాధవనగర్, అర్సపల్లి ఆర్వోబీ
పనులపై చర్చ
పనుల పూర్తికి ముఖ్యమంత్రి హామీ
ఇచ్చారన్న పీసీసీ అధ్యక్షుడు
మహేశ్‌కుమార్ గౌడ్


