ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మోపాల్, లింగంపేట మండలాల్లో ఇద్దరు, మేడ్చల్ జిల్లాలో కామారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడ్డారు.
మోపాల్: మండల కేంద్రానికి చెందిన కళ్ల గంగాధర్ (48) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. గంగాధర్ గ్రామంలోనే ఉంటూ ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా కుటుంబ సమస్యలు, చీటీ డబ్బుల వ్యవహారంలో తీవ్ర మనస్తాపానికి గురవుతూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇంటి బంగ్లాపై ఉన్న ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే దించినప్పటికీ.. అప్పటికే గంగాధర్ మృతి చెందాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పోతాయిపల్లిలో ఒకరు..
లింగంపేట్(ఎల్లారెడ్డి): మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన గన్నారం సాయిలు(45) శనివారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై దీపక్‌కుమార్ తెలిపారు. సాయిలు భార్య రెండు సంవత్సరాల క్రితం భర్తతో గొడవపడి ముగ్గురు పిల్లలను తన వెంట తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. భార్య కాపురానికి రా వడం లేదని మనస్తాపం చెందిన సాయిలు ఇంట్లో ఎవ రూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై పేర్కొన్నారు. తండ్రి చిన్న సాయన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బీటెక్ విద్యార్థిని..
మేడ్చల్‌రూరల్: హాస్టల్ గది లో ఉరేసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన అక్షయ(19) గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిఽ ది కండ్లకోయలోని సీఎంఆర్‌ఐటీ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతూ స్థానికంగా ఉన్న ముకుందా హాస్టల్‌లో ఉంటుంది. శనివారం హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


