ఎండిన మడి | - | Sakshi
Sakshi News home page

ఎండిన మడి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

అందని

తడి..

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : ఈసారి ఎల్‌నినో ప్ర భావం రైతులను నిండా ముంచింది. జిల్లాలో శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్ట్‌ చెంతనే ఉన్న సమీప మండలా లు, గ్రామాల్లోనూ కరవుచాయలు కనిపిస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. చివరి దశలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీరు ఆదుకుంటుందని ఆశించిన రై తులకు నిరాశే మిగిలింది. వర్షాలు లేక, ప్రాజెక్ట్‌ నీరు అందక పంటలు ఎండిపోయాయి. తీరా పంటలు ఎండిన తర్వాత ఈనెల 10 నుంచి ప్రభుత్వం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల చేయ డంపై రైతులు పెదవి విరుస్తున్నారు. నీటి విడుదల విషయంలో ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసు కోకపోవడంతో తామంతా తీవ్రంగా నష్టపోయా మని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అదను దాటాక నీటి విడుదల..

ఈసారి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వరద ప్రవాహం తక్కువగా ఉండటంతో ఆశించిన స్థాయిలో ప్రాజెక్టు నిండలేదు. ఆయకట్టు పరిధిలోని రైతులు బోర్లు, భూగర్భజలాల ఆధారంగా పంటలను సాగుచేసినా చివరి దశలో ప్రాజెక్ట్‌ నీరు అందుతుందని భావించారు. ఆగస్టు చివరి నాటికి ప్రాజెక్ట్‌లో నీటినిల్వ 46 టీఎంసీలకు చేరుకోవడంతో రైతుల్లో ఆశలు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితులతో పాటు కరెంట్‌ కోతలతో పంటలకు నీరందే పరిస్థితి లేకపోవడంతో ప్రాజెక్ట్‌ నీటి విడుదల కోసం నిరీక్షించారు. అయితే సరైన సమయంలో ప్రాజెక్ట్‌ నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. పంటలు చేజారక ఈనెల 10 నుంచి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ మెయిన్‌ కెనాల్‌ ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు. కాకతీయ కాల్వ నుంచి నిత్యం 6,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. తాజాగా వరద కాల్వ ద్వారా సైతం మరో 4,500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలో నీటిని విడుదల చేస్తారని భావించగా, పంటలు ఎండిన తర్వాత ప్రాజెక్ట్‌ నీటి విడుదలపై రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇతర జిల్లాలకే ప్రయోజనం.. జిల్లా రైతులకు నష్టం

జిల్లాలో ఈసారి వానాకాలం సీజన్‌లో మొత్తం 4.30 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. రాష్ట్రంలోనే ముందస్తుగా జిల్లాలో పంట చేతికొస్తుంది. ఇప్పటికే వర్ని, ఎడపల్లి, మోస్రా, నందిపేట్‌ తదితర మండలాల్లో వరికోతలు చాలావరకు పూర్తయ్యాయి. మిగతా మండలాల్లోనూ వరికోతలు మొదలయ్యాయి. చివరి దశలో పంటలను కాపాడుకునేందుకు ప్రాజెక్ట్‌ నీరు ఆసరా అవుతుందని భావించగా జిల్లా రైతులకు నిరాశే మిగిలింది. పంటలు ఎండిపోయిన తర్వాత నీటి విడుదలతో జిల్లా రైతులకు ప్రయోజనం లేదని రైతులు చెబుతున్నారు.

పక్కనే ప్రాజెక్ట్‌ ఉన్నా చుక్క నీరు అందక తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదలతో జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి తదితర ఇతర జిల్లాలకే నీటి సరఫరా అవుతోందని, జిల్లాలోని తమకు ప్రయోజనం దక్కలేదని రైతులు వాపోతున్నారు.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ సమీపంలోనే

ఎండిన వరిపైరు

మెండోరా మండలం సావెల్‌లో

తడి అందక చేతికందని పంటలు

పంటలు నష్టపోయాక ఆలస్యంగా

నీటి విడుదల

పరిస్థితి చేజారిపోయిందని

రైతుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement