జర్మన్‌ భాష శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జర్మన్‌ భాష శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Oct 16 2026 10:28 AM | Updated on Oct 16 2026 10:28 AM

ఖలీల్‌వాడి : జర్మన్‌ భాష శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి ఆన్నారు. జర్మనీ దేశంలో ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగాలు పొందేందుకు వీలుగా అర్హులైన యువతీ, యువకులకు ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ద్వారా ఉచితంగా భాషా శిక్షణను కలెక్టర్‌ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జర్మనీలో నర్సింగ్‌, కార్పెంటర్‌, ఫిజియోథెరపీ వంటి అనేక రంగాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దేశంతో ఉద్యోగాల కల్పన కోసం ఒప్పదం చేసుకుందన్నారు.

అర్హులైన వారికి ఉచితంగా జర్మన్‌ భాషలో శిక్షణ అందించేందుకు ఈ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడు నెలల శిక్షణ అనంతరం ఉత్తీర్ణులైన వారికి వీసాను సమకూర్చి జర్మనీ దేశంలో ఆకర్షణీయమైన వేతనంపై ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ అధికారిణి విజేత, బాలుర, బాలికల ఐటీఐ ప్రిన్సిపాల్‌లు యాదగిరి, విద్యాసాగర్‌, జర్మనీ భాషా బోధకుడు ధీరజ్‌, స్థానిక కార్పొరేటర్‌ జగదీశ్‌ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement