కమ్మర్పల్లి: మండలంలోని ఉప్లూర్‌లో ఈ నె ల 17, 18 తేదీల్లో నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల స్థాయి ఇన్విటేషన్ వాలీ బాల్ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. స్థానిక జెడ్పీహెచ్ఎస్లో సరసం గంగారెడ్డి చారిటబుల్ ట్రస్ట్, ఉప్లూర్ వాలీబాల్ అసోసియేషన్, యూత్స్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో నిర్వహించనున్న పోటీల్లో మూ డు జిల్లాల జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదని, పోటీల్లో విజేత జట్టుకు రూ. 11,111, ర న్నర్ జట్టుకు రూ.6,666, తృతీయ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.3,333 నగదు బ హుమతులు అందజేస్తామన్నారు.
ధ్రువపత్రాలు అందుబాటులో
ఉంచుకోవాలి
వర్ని : భూభారతికి సంబంధించి భూముల సర్వే ధ్రువపత్రాలను రైతులు సిద్ధంగా ఉంచుకోవాలని జిల్లా డిప్యూటీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శశికాంత్ సూచించారు. భూభారతి భూముల రీ సర్వేపై చందూర్ మండలం కారేగాం తండాలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు భూములకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకొని అధికారులకు సహకరించాలని సూచించారు. సర్పంచ్ రమావత్ లాల్‌సింగ్, తహసీల్దార్ వీర్‌సింగ్, ఆర్ఐ భాస్కర్, అధికారులు దత్తు, శేఖర్, ఫాతిమా, మోహన్ పాల్గొన్నారు.
జీజీహెచ్‌కు వైద్య
పరికరాల అందజేత
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూ.65 లక్షల విలువైన వైద్య పరికరాలను అందజేసింది. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ)లో భాగంగా ఐవోసీ అందజేసిన ఆర్థోపెడిక్ విభాగం వైద్య పరికరాలను మెడికల్ కళాశాల, జీజీహెచ్ వైద్యాధికారులు శ్రీనివాస్, జలగం తిరుపతిరావు గురువారం ప్రారంభించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ రాములు తదితరులు పాల్గొన్నారు.
రైతు సమస్యలను
వెంటనే పరిష్కరించాలి
నిజామాబాద్ అర్బన్ : రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాగునీరందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు సాగునీరందించడంతోపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని పేర్కొన్నారు. సమయానికి పంట పెట్టుబడి అందక, యూరియా లభించక, విద్యుత్ సరఫరాలో అంతరాయం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.


