మాక్లూర్: ప్రస్తుతం ప్రారంభించుకున్న కొనుగోలు కేంద్రాలను రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు చేయిస్తామని, రైతులు కూడా సహకరించాలని మాక్లూర్ విండో చైర్మన్ బూరోల్ల అశోక్ కోరారు. సోమవారం మండల కేంద్రంలోని వ్యవసాయ పరపతి సంఘంలో కార్యదర్శి ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన 85వ మహాజన సభకు చైర్మన్ బూరోల్ల అశోక్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అధిక ధరకు ఆశపడి దళారుల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు. పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సోసైటీ వైస్ చైర్మన్ గుండారం శేఖర్, స్థానిక సర్పంచ్ సాయినేని వెంకటేశ్వర్‌రావు, మాజీ చైర్మన్లు దయాకర్‌రావు, రమణారావు, మాజీ సర్పంచ్ రాజేందర్, రైతులు పాల్గొన్నారు.


