వర్ని: చందూరు మండల కేంద్రానికి చెందిన గూడూరు అన్సిక్.. ఇంటర్నేషనల్ ఠాగూర్ ఫిలిం అవార్డుకు ఎంపికయ్యారు. తమిళనాడు రాష్ట్రంలోని చైన్నె ఎల్వీ ప్రసాద్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ కోర్సులో శిక్షణ పొందుతున్న అన్సిక్ భారతదేశంలో నీట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఆవేదనపై ఒకే పేపర్ ఒక జీవితాన్ని నిర్ణయించలేదు అనే లఘు చిత్రాన్ని చిత్రీకరించాడు. దీనిని గుర్తించి ఇంటర్నేషనల్ ఠాగూర్ ఫిలిం అవార్డుకు ఆ లఘుచిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ ఎంపిక పట్ల తల్లిదండ్రులు శేఖర్, శోభా రాణి తో పాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మండలం పిప్రి గ్రామంలో ఫత్తెపూర్ గ్రామానికి వెళ్లే రోడ్డులో ఉన్న గుండెలవ్వ దేవత విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈనెల 2న ఇనన్‌స్ట్రాగామ్‌లో విగ్రహ ధ్వంసం వీడియో చూసిన సర్పంచ్ బందెల కిరణ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నిజంగానే విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించి ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సై యాసిర్ అరాఫత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ పోలీస్‌స్టేషనన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన పొలాస సుధాకర్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలా చర్యలు తీసుకుంటామని భీమ్‌గల్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులు బొదిరే స్వామి, కన్నె సురేందర్, పర్స అనంతరావు మీడియాతో మాట్లాడారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడుమహేష్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌న్‌రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, మాజీ స్టేట్ కో–ఆపరేటివ్ చైర్మన్‌్ మానాల మోహనన్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇనన్‌చార్జి ముత్యాల సునీల్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
వేల్పూర్: వెంకటాపూర్‌లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డికి మంగళవారం నిజామాబాద్‌లో విన్నవించినట్లు సర్పంచ్ కోనవత్రి నరేందర్ తెలిపారు. రెండు చోట్ల సీసీ డ్రెయిన్‌లు, నిజాంసాగర్ కాలువ పక్కన బైపాస్ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.


