● కామారెడ్డి– సిరిసిల్ల రహదారిపై రాస్తారోకో
మాచారెడ్డి: అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం పాల్వంచ మర్రి వద్ద కామారెడ్డి సిరిసిల్ల రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లా డుతూ... కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొని పొలాలు స రిగా పారగా బీటలు వారుతున్నాయని ఆవేదన వ్య క్తం చేశారు. కరెంటు లో వోల్టేజ్‌తో ట్రాన్స్ఫార్మర్లు, వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కో సం అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించిన తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. లో వో ల్టేజీతో రెండు మూడు రోజులకోసారి ట్రాన్స్ఫార్మ ర్లు కాలిపోతున్నాయని దాంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదా పు గంటపాటు రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అ క్కడ నిలిచిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న మాచారెడ్డి ఎస్సై విజయ్ అక్కడికి చేరుకొని రైతులను సముదాయించారు. అధికారులు వచ్చి హామీ ఇచ్చేంత వరకు కదిలేది లేదంటూ రైతులు భీష్మించుకూర్చున్నారు.కామారెడ్డి ఏడీఏ నరేష్ చేరుకొని లోవోల్టేజి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


