రెంజల్: జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల పై అదనపు భారం పడనుంది. ఈ నెల నుంచి టీజీఎన్‌పీడీఎల్ సంస్థ ‘ట్రూ అప్’ పేరుతో అదనపు చార్జీలను వసూలు చేస్తోంది. నవంబర్‌లో యూనిట్‌కు రూ.30 పైసలు, వచ్చే నెల నుంచి 50 పైసల చొప్పున వినియోగదారుల నుండి వసూలు చేయనుంది. ఈ నెలలో వినియోగదారులకు అందిన బిల్లులో ట్రూ అప్ చార్జీని కలిపారు. 2022–23, 2023–24 సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ కొనుగోలులో వ్యత్యాసాన్ని పూడ్చుకునేందుకు డిస్కమ్‌లు వినియోగదారుల బిల్లుల్లో అదనపు మోతను ప్రారంభించాయి.
గృహజ్యోతిపై స్పష్టత కరువు
200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా ఉచితంగా విద్యుత్‌ను అందిస్తోంది. అదనంగా వసూలు చేస్తున్న ట్రూ అప్ చార్జీల భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా లేక గృహజ్యోతి లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తుందా అనే అంశంపై విద్యుత్ శాఖకు స్పష్టత లేదు.
అదనపు చార్జీలు
వినియోగదారుడు వినియోగించుకున్న యూనిట్ల ఆధారంగా సరాసరి తీసి స్లాబ్‌లతో సంబంధం లేకుండా యూనిట్ల పై రుసుము వేస్తున్నారు. ఇప్పటికే బిల్లులో కస్టమర్, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, సర్‌చార్జి తదితర వాటి కింద రూ.70 నుంచి రూ.80 వరకు వసూలు చేస్తున్నారు.
జిల్లాలో కేటగిరీల వారీగా కనెక్షన్‌లు
వ్యవసాయానికి మినహాయింపు
గృహజ్యోతిపై ఆదేశాలు రాలేదు
గృహజ్యోతి వినియోగదారుల వద్ద నుంచి ట్రూ అప్ చార్జీల వసూలుపై స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ఈఆర్‌సీ నిర్ణయం మేరకు ఈ నెలలో ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడే చెప్పలేం. వచ్చే నెలలో అవగాహన వస్తుంది.
– పీవీ రాజేశ్వర్‌రావ్, విద్యుత్ ఎస్‌ఈ
అదనపు విద్యుత్ వసూళ్ల నుంచి ఈఆర్‌సీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌లకు మినహాయింపు ఇచ్చింది. మిగిలిన గృహ అవసరాలు, వ్యాపార సముదాయాలు సహా తొమ్మిది కేటగిరిల్లో కొన్నిటికి మినహాయింపు ఇవ్వగా మిగిలిన కేటగిరిల వినియోగదారులు తప్పని సరిగా ట్రూ అప్ చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని ఈఆర్‌సీ స్పష్టం చేసింది.
విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం
మొదటి నెల యూనిట్‌కు 30 పైసలు.. వచ్చే నెల నుంచి 50 పైసలు
గృహజ్యోతి వినియోగదారులకు
స్పష్టత కరువు
అద్దె ఇళ్లలో ఉంటున్న వారికి
తప్పని భారం


