దీపావళి.. ఐదు రోజుల వేడుక | - | Sakshi
Sakshi News home page

దీపావళి.. ఐదు రోజుల వేడుక

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

● మద్నూర్‌లో మహారాష్ట్ర సంస్కృతి

మద్నూర్‌(జుక్కల్‌) : మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మద్నూర్‌ మండలంలో దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగపైనా అక్కడి సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. సాధారణంగా ఇతర ప్రాంతాలలో ఒకటి రెండు రోజులు దీపావళి జరుపుకుంటే.. మద్నూర్‌లో మాత్రం ఐదు రోజులపాటు చేసుకుంటారు. దీపావళికి రెండు రోజుల ముందునుంచే ఇక్కడ సందడి కనిపిస్తుంది.

తొలిరోజు వసుబారస్‌ (గోపూజ)

వసుబారస్‌తో పండుగ సందడి మొదలవుతుంది. వసుబారస్‌ అంటే గోవు ద్వాదశి అని అర్థం. ఈ రోజున ఆవు, దూడను కలిపి పూజిస్తారు. ఆవు దయ వల్ల ఇంట్లో సుఖం, సంపద లభిస్తాయని ప్రజలు నమ్ముతారు.

మూడో రోజు దీపావళి..

దీపావళి పండుగను అంతటా జరుపుకుంటారు. ఈ రోజు ఇంటినంతా శుభ్రం చేసి ముగ్గులు వేసి దీపాలతో అలంకరిస్తారు. సాయంత్రం లక్ష్మీదేవి, గణపతిని పూజించి స్వీట్లు పంచుకుంటారు.

నాలుగో రోజు బలిపాడ్యమి..

అమావాస్య మరుసటి రోజున వచ్చే పాడ్యమిని బలి పాడ్యమిగా చెబుతారు. ఈ రోజున కూడా ప్రజలు లక్ష్మీదేవి పూజలు నిర్వహిస్తారు. భార్యాభర్తలు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకుంటారు. ఐదోరోజు భావూ బీజ్‌..

దీన్ని అన్నా–చెల్లెళ్ల పండుగ అంటారు. ఈ రోజు చెల్లెలు అన్నకు తిలకం పెట్టి, హారతి ఇచ్చి, తీపి వంటకాలు తినిపిస్తుంది.

రెండో రోజు ధనత్రయోదశి..

ఈ రోజును ధన్వంతరి జయంతిగానూ జరుపుకుంటారు. ఈ రోజు కొత్త బంగారం, వెండి, స్టీల్‌ సామగ్రి, కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవిని పూజించి, ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. వ్యాపారులు ఈ రోజు నుంచే కొత్త ఖాతా పుస్తకాలు రాయడం మొదలు పెడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement