జిల్లా ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు ప్రముఖుల దీపావళి శుభాకాంక్షలు

Nov 8 2026 1:13 AM | Updated on Nov 8 2026 1:13 AM

నిజామాబాద్‌అర్బన్‌: దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్‌ రెడ్డి, కలెక్టర్‌ ఇలా త్రి పాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపా రు. అందరి జీవితాల్లో కష్టాల కారుచీకట్లు తొలగి చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా నిర్వహించుకునే దీపావళి పండుగను ప్రమాదాలకు తావులేకుండా జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని కోరారు.

మార్కెట్‌యార్డుకు వరుస సెలవులు

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి మేరకు నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌యార్డు (శ్రద్ధానంద్‌ గంజ్‌)కు సెలవులు ప్రకటించినట్లు సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ విజయ్‌ కిశోర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్‌ 5 నుంచి 10వ తేదీవరకు గంజ్‌లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించబోమని పేర్కొన్నారు. రైతులు యార్డునకు పంట ఉత్పత్తులు తీసుకురావొద్దని సూచించారు. 11వ తేదీ నుంచి నూతన వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతాయని, రైతులు మార్కెట్‌ కమిటీకి సహకరించాలని కోరారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దు

నిజామాబాద్‌అర్బన్‌: ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొద్దని, రోడ్లపై వ్యాపారాలు నిర్వహించొద్దని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలో శనివారం రాత్రి ఆయన గాంధీచౌక్‌, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో ప ర్యటించి ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలను పరిశీలించారు. ఎక్కువగా జనాలు సంచరించే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్‌ స్పెషల్‌ టీములను ఏర్పాటు చేశా రు. రోడ్డు పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో మాట్లాడారు. ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా సంబంధిత నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. సీపీ వెంట వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌, ట్రాఫిక్‌ సీఐ సురేశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

పేకాడితే చర్యలు..

పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటా మని సీపీ సాయిచైతన్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా పేకాట పూర్తిగా నిషేధమన్నారు. పండుగ నేపథ్యంలో స్పెషల్‌ టీములు, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా పేకాట స్థావరాలు కొనసాగితే పోలీస్‌కంట్రోల్‌ రూమ్‌ (87126 59700)కు సమాచారం అందించాలని కోరారు.

త్వరలో జిల్లాలో

నితిన్‌ నబీన్‌ పర్యటన

సుభాష్‌నగర్‌: దేశవ్యాప్తంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో సైతం యాత్ర నిర్వహించాలని తన విజ్ఞప్తి మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీ న్‌ సానుకూలంగా స్పందించారని, ఆయన త్వరలోనే పర్యటిస్తారని ఎంపీ అర్వింద్‌ ధర్మపురి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయి నాయకత్వం నిజామాబాద్‌లో పర్యటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా ఖరారు కాలేదని, పర్యటన తేదీలు, కార్యక్రమాలు ఖరారైన వెంటనే జిల్లాలో కూడా యాత్ర నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తానని నబీన్‌ తెలిపినట్లు పేర్కొన్నారు.

ఈవీఎం గోదాము పరిశీలన

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని వి నాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదామును అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌తో కలిసి కలెక్టర్‌ ఇలా త్రిపాఠి శనివారం సందర్శించారు. సా ధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఈవీ ఎం గోదామ్‌ సీల్‌లను, బందోబస్తును పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, సిబ్బంది సాత్విక్‌, విజయేందర్‌రెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి శంకర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement