నిజామాబాద్ అర్బన్: రాష్ట్రస్థాయి అండర్ – 17 బాలికల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ అలివేణి మంగ తెలిపారు. ఈనెల 5, 6వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల క్రీడా పోటీల్లో 33 జిల్లాలకు చెందిన బాలికల జట్లు పాల్గొన్నాయన్నారు. జిల్లా జట్టు సభ్యులను అడిషనల్ కలెక్టర్ భుజంగరావు, జిల్లా విద్యాశాఖ అధికారి సాయాగౌడ్ శనివారం అభినందించారు. పీఎంశ్రీ పాఠశాలల హెచ్‌ఎంలు వనజారెడ్డి, భూమాగౌడ్, సురేశ్‌కుమార్, అశోక్, లింగన్న వ్యాయామ ఉపాధ్యాయులు సాయిరాధా, క్రాంతి, లావణ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
వాలీబాల్ పోటీల్లో మొదటిస్థానం
70వ రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ పోటీలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వహించగా.. అండర్ 17 బాలికల విభాగంలో జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచిందని ఎస్‌జీఎఫ్ సెక్రెటరీ అలివేణి మంగ తెలిపారు. కోచ్‌గా కోచ్‌గా సుష్మ, మధు వ్యవహరించారని తెలిపారు.


