గుత్ప ఎత్తిపోతలకు గ్రహణం | - | Sakshi
Sakshi News home page

గుత్ప ఎత్తిపోతలకు గ్రహణం

Oct 2 2026 7:26 AM | Updated on Oct 2 2026 7:26 AM

నెల రోజుల్లో పనులు..

● ఎనిమిదేళ్లుగా ముందుకు

సాగని పనులు

● ఇబ్బంది పడుతున్న రైతులు

● పట్టించుకోని అధికారులు

మాక్లూర్‌: మండలంలోని గుత్ప ఎత్తిపోతల పథకానికి ఏళ్లుగా ఎదురుచూస్తున్నా రైతుల ఆశలు నెరవేరడం లేదు. 2016 ఆగస్టు 16న నాటి రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఈ పథకం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. గుత్ప చెరువు వరకు సాగునీరు అందుతుందని ఆశించిన రైతులకు నిరేశే మిగులుతోంది. ఈ పథకం ద్వారా సాగునీరు అందుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు.

గుత్ప ఎత్తిపోతల పథకం పరిధిలోని జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి, లక్ష్మాపూర్‌, నారాయణ్‌పేట, అర్గుల్‌, మాక్లూర్‌ మండలం అడవి మామిడిపల్లి, చిన్నాపూర్‌, రాంచంద్రాపల్లి, గుత్ప, అమ్రాద్‌, ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌కు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. మొత్తం మూడు మండలాలకు కలిపి సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించారు. అయితే ఈ పథకం పనులు 2019లోనే పనులు పూర్తి చేయాల్సి ఉన్నా సాంకేతిక, ఇతర కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని అధికారులు పేర్కొంటున్నారు. పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో స్థానిక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పిన అధికారులు, గతంలో పూనులు పూర్తి చేసి రైతులకు ప్రయోజనం కల్పిస్తామని హామీ ఇచ్చినా అది ఆచరణలోకి రాలేదని రైతులు వాపోతున్నారు. పథకం పనులు పూర్తయితే ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీటి కష్టాలు తీరడంతో పాటు వ్యవసాయంపై ఆధారపడే కుటుంబాలకు ఆర్థికభరోసా కలుగుతుందని వారు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుత్ప చెరువుకు నీరు అందించే లా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఎత్తిపోతల పథకం పనులు 70 శాతం పూర్తయ్యాయి. మిగిలిన 30 శాతం పనులు నెల రోజుల్లో ప్రారంభిస్తాం. ఎత్తిపోతల పథకానికి సంబంధించి పైప్‌లైన్‌ కోసం ఫారెస్టు అధికారుల నుంచి క్లియరెన్స్‌, సంబంధిత కాంట్రాక్టర్‌కు రావాల్సిన రూ. కోటి 70 లక్షలు పెండింగ్‌లో ఉండటంతో పనుల్లో జాప్యం జరిగింది. లిఫ్ట్‌కు సంబంధించిన మోటర్లు గుత్ప చెరువు వద్ద ఉన్న పంప్‌ హౌస్‌లో ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయి. విద్యుత్‌ సరఫరా పనులు కూడా పూర్తయ్యాయి.

– రవికుమార్‌, ఇరిగేషన్‌ డీఈ,

ఆర్మూర్‌ డివిజన్‌ నందిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement