నిజామాబాద్ రూరల్: చేనేత రంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని డీసీసీబీ సీఈవో నాగభూషణం అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్వాగార్డెన్‌లో చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి అధ్యక్షతన చేనేత కార్మికుల సహకార సంఘం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. చేనేత రంగానికి ఎంతో ప్రాచీనమైన, ఘనమైన చరిత్ర ఉందన్నారు. చేనేత వస్త్రాలకు ప్రజల్లో ఎంతో ఆదరణ, ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని, ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దాసరి నర్సింలు, దీకొండ యాదగిరి, పుల్గం హన్మాండ్లు, పెంటం దత్తాద్రి, అవధూత విఠల్, రాజు, నరసింహులు, కారంపుడి ప్రభు, గుద్దేటి రామకృష్ణ శంకర్, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


