● డీఆర్‌డీవో సాయన్న
డిచ్‌పల్లి: వీబీజీరామ్‌జీ కార్యక్రమంలో భాగంగా ఉపాధి హామీ సిబ్బంది ఒక్కో గ్రామం నుంచి 200 మంది వరకు కూలీలను సమీకరించాలని జీపీ కార్యదర్శులు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్‌డీవో) సాయన్న సూచించారు. డిచ్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో డీఆర్‌డీవో వీబీజీరాంజీ కార్యక్రమం కింద వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో నిర్వహించనున్న పనులపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కూలీల సంఖ్య పెంచి వారికి తగినంత పనులు కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిచ్‌పల్లి ఎంపీడీవో ఉదయభాస్కర్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీవో మంజుల, జీపీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు తదితరులు పాల్గొన్నారు.


