ఈకేవైసీతో తొలగిపోతాయి
● స్మార్ట్ రేషన్ కార్డుల్లో మృతుల పేర్లు
● మరణించిన వారి పేర్లను
తొలగించని అధికారులు
● ఇప్పటికీ సరఫరా అవుతున్న బియ్యం
రెంజల్: రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న స్మార్ రేషన్ కార్డులు లబ్ధిదారులతోపాటు చనిపోయిన వారికి కూడా వస్తుండటం విస్మయం కల్గిస్తోంది. నిజమైన అర్హులైన పేదలకు అందాల్సిన బియ్యం, ఇలా ఉనికిలో లేని వారి పేర్ల మీద దుర్వినియోగం అవుతున్నాయి. చనిపోయిన వారికి బియ్యం కోటా రావడంతో మాకు నష్టమేం లేదని కొందరు ఊరుకుంటున్నారు. కానీ, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. కానీ ఇవేమి పట్టని చాలామంది వేలి ముద్రలు వేసి నెలనెల బియ్యం తీసుకుంటున్నారు.
ఈకేవైసీ 82 శాతమే పూర్తి..
అక్రమంగా రేషన్‌కార్డు పొందిన వారితో పాటు మృతుల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ఈకేవైసీని అమలు చేస్తుండగా జిల్లాలో నత్తనడకన సాగుతోంది. ఆగస్టు నెల 31 వరకు గడువును ప్రభుత్వం విధించినా ఇప్పటి వరకు 82 శాతం మాత్రమే పూర్తయింది. జిల్లాలో 4.77 లక్షల రేషన్‌కార్డులు ఉండగా జిల్లాలోని 749 రేషన్ దుకాణాల ద్వారా ప్రతీ నెల 10 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తుంది.
ప్రభుత్వ ఖజానాకు గండి..
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానిక రేషన్ డీలర్ల ద్వార గ్రామాల్లో మృతిచెందిన లబ్ధిదారుల వివరాలను సేకరించి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. విచారణ చేపట్టి మృతుల పేర్లను తొలగించడంలో నిర్లక్ష్యం వహించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకతను తీసుకవచ్చేందుకు స్మార్ట్ రేషన్‌కార్డులను పంపిణీ చేస్తున్నా మృతి చెందిన వారి పేర్లను తొలగించకుండా వారి పేరున కార్డులను ఇస్తోంది. దీంతోపాటు ప్రతీ నెల రేషన్ బియ్యం సరఫరాచేయడంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది.
గతంలో రేషన్ డీలర్లు మృతుల జాబితాను రెవె న్యూ అధికారులకు అందించారు. రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికలను అంది స్తే జాబితా నుంచి మృతుల పేర్లను తొలగించవ చ్చు. డీలర్లు తప్పుడు నివేదికలు ఇవ్వవచ్చు. వా టి ని ప్రామాణికంగా తీసుకోలేం. ఈకేవైసీతో అక్రమా లు తొలగిపోతాయి. ఈకేవైసీ లేని ల బ్ధిదారులకు నవంబర్ నెల నుంచి బియ్యం సరఫరాను నిలిపివేస్తాం. చనిపోయిన వారికి స్మార్ట్‌కార్డు లు వచ్చినా వారు దుకాణానికి వచ్చి రేషన్ తీసుకోరు. యథావిధిగా నిలిచిపోతుంది. – శ్రీకాంత్‌రెడ్డి, డీఎస్‌వో


