డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళలు చిరు వ్యాపారాల ను ప్రారంభించి ఆర్థికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు పి లుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వి–హబ్ ఆ ధ్వర్యంలో అన్ని మండలాల మహిళా వ్యాపారవేత్తల తో నిర్వహించిన ర్యాంప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వి–హబ్ మ హిళా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తూ, వారి ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, బ్రాండింగ్ సౌకర్యాలు కల్పించడంలో తోడ్పాటు అందించాల ని కో రారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో మరింత రాణించాలని, వ్యాపారాలు ప్రారంభించే వారికి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో సాయన్న తెలిపారు. మహిళలు స్వయంగా తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం ఉల్లాస్‌పై మరో సమీక్ష నిర్వహించారు. ఏపీడీ మధుసూదన్, డీపీఎం మోహన్, ఏపీఎంలు పాల్గొన్నారు.


