రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు తలెత్తొద్దు

Sep 19 2026 9:02 AM | Updated on Sep 19 2026 9:02 AM

అదనపు కలెక్టర్‌ భుజంగరావు

ధాన్యం కొనుగోళ్లపై సన్నాహక సమావేశం

సుభాష్‌నగర్‌: ఖరీఫ్‌లో రైతులు పండించిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ భుజంగరావు సూచించారు. రైతులు ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం, శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి కొనుగోలు కేంద్రంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పంట విక్రయం విషయంలో రైతులు ఇబ్బందులకు గురికాకుండా, పూర్తి పారదర్శకంగా ధాన్యం సేకరణ జరగాలన్నారు. సరిపడా సంఖ్యలో తేమ కొలిచే యంత్రాలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా తూకం, తరుగు వంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని, ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. సమస్యలు గమనించిన వెంటనే వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. సమావేశంలో డీఎస్‌వో శ్రీకాంత్‌ రెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్‌, సివిల్‌ సప్లయ్‌ డీఎం ప్రవీణ్‌, ఏఎస్‌వో అరవింద్‌ రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ అధికారిణి గంగుబాయి, తూనికలు కొలతల శాఖ అధికారి షుజాత్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement