● రెండు రోజులపాటు
రాకపోకలు బంద్
డిచ్‌పల్లి: ముథ్కేడ్ – మేడ్చల్ డబ్లింగ్ ప్రా జెక్టు పనుల కోసం డిచ్‌పల్లి – ఘన్‌పూర్ రో డ్ మధ్య ఉన్న రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్‌ను రెండు రోజులపాటు తాత్కాలికంగా మూ సివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీఎస్‌ఎల్‌ఎస్‌వీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నవీపేట్ – ఇందల్వాయి స్టేషన్ల మ ధ్య డబ్లింగ్ పనుల్లో భాగంగా గేట్ లాడ్జ్ షిఫ్టింగ్, ట్రాక్ లింకింగ్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 22 ఉదయం 8 గంటల నుంచి 24వ తేదీ ఉదయం 8 గంటల వరకు రైల్వే గేట్ వద్ద రా కపోకలను పూర్తిగా నిలిపివేయనున్నట్లు వి వరించారు. వాహనదారులు, ప్రజలు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.
నేడు, రేపు రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో శని, ఆదివారాల్లో 11వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి ప్రభాకర్, మర్కంటి గంగామోహన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. రాష్ట్రంలోని 22 జిల్లాలకు చెందిన జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. మినీ స్టేడియంలో క్రీడల నిర్వహణ ఏర్పాట్లను పీడీ నాగభూషణం, సీనియర్ క్రీడాకారులు సాగర్, సురేశ్, విక్రమ్, చైతన్య, కోచ్‌లు రాహుల్, నరేశ్ పరిశీలించారు.
నేడు బాలికల
జిల్లాస్థాయి రగ్బీ టోర్నీ
సుభాష్‌నగర్: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో శనివారం జిల్లాస్థాయి బాలికల రగ్బీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు రగ్బీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రెంజర్ల నరేశ్ తెలిపారు. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. ‘అస్మిత ఖేలో ఇండియా’లో భాగంగా బాలికలలో మనోధైర్యా న్ని పెంచే లక్ష్యంతో కేంద్ర యువజన, క్రీడ ల మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. నిజామాబాద్ రగ్బీ అసోసి యేషన్ ఆధ్వర్యంలో టోర్నీ నిర్వహిస్తున్నా మని పేర్కొన్నారు. టోర్నమెంట్‌కు ఇప్పటికే 30 జట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని తెలిపా రు. ప్రారంభానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, అ సో సియేషన్ చీఫ్ ప్యాట్రన్ డాక్టర్ మా రయ్యగౌ డ్, జీజీ కళాశాల ప్రిన్సిపల్ రాంమోహన్‌రె డ్డి, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి బొబ్బిలి నర్సయ్య హాజరవుతారని వివరించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్, రాజ్‌గణేశ్, స్వామి యాదవ్, ప్రధానకార్యదర్శి అబ్బయ్య పాల్గొన్నారు.


