‘సాగర్‌’లోకి 2,945 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

‘సాగర్‌’లోకి 2,945 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Sep 19 2026 9:02 AM | Updated on Sep 19 2026 9:02 AM

నిజాంసాగర్‌ : ఎగువన కురుస్తున్న వర్షాలతో ని జాంసాగర్‌ ప్రాజెక్టులోకి శుక్రవారం 2,945 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. శుక్రవారం సాయంత్రానికి 1,400.25 అడుగుల (11.622 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు.

ఆదాయం పెంచేందుకు

కృషి చేయాలి

ఆర్టీసీ ఈడీలు సోలమన్‌, రాజశేఖర్‌

నిజామాబాద్‌ రూరల్‌: టీజీఎస్‌ ఆర్టీసీకి వాణిజ్య ఆదాయం పెంపొందించేందుకు కృషి చేయాలని, ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని కరీంనగర్‌ జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సోలమన్‌, రాజశేఖర్‌ సూచించారు. శుక్రవారం నిజామాబాద్‌ రీజియన్‌ను వారు పరిశీలించారు. నిజామాబాద్‌, ఆర్మూర్‌ బస్టాండ్లు, ఇతర స్థలాలను సందర్శించారు. వారి వెంట నిజామాబాద్‌ ఆర్‌ఎం కృష్ణమూర్తి, డీఆర్‌ఎం జ్యోతి, డిపో–1, 2 మేనేజర్లు ర మణ, శ్రీనివాస్‌, పీవో పద్మజ తదితరులు ఉన్నారు.

పోలీసుల అదుపులో

హత్య కేసు నిందితుడు!

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా కేంద్రంలో గురువారం జరిగిన హత్య కేసులో నిందితుడు పోలీసుల అదు పులో ఉన్నట్లు సమాచారం. యూ ట్యూబర్‌ వైష్ణవి ని హత్య చేసిన ఆమె భర్త హరిబాబును ఆర్‌ఆర్‌ చౌ రస్తా వద్ద పట్టపగలే ఆమె సోదరుడు సంతోష్‌ కత్తి తో దాడిచేసి హతమార్చిన విషయం తెలిసిందే. అనంతరం రాత్రి కోరుట్లకు వెళ్లి అక్కడి పోలీసుల ఎదుట లొంగిపోగా, నిందితుడిని జిల్లా పోలీసుల కు అప్పగించినట్లు తెలిసింది. శనివారం జిల్లా పోలీ సులు వివరాలు వెల్లడించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement