● జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్
నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ అన్నారు. బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సెమినార్‌లో గెలుపొందిన విజేతలకు బహుమతులు, మెమోంటోలు అందజేశారు. ఈ నెల 29 నిర్వహించే రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు అక్షయ, నిజ్‌మా తైసిన్, జీ కీర్తన, పీ అక్షర, ఫిర్దౌస్, జీ అక్షర పాల్గొంటారని అన్నారు. అక్కడ గెలుపొందే వారు దక్షిణ భారత స్థాయికి ఎంపిక అవుతారని తెలిపారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణయితలు సీహెచ్ ముద్దుకృష్ణ, బీ సాయిబాబా, రఘునాథ్ ,గోవర్ధన్, కాంతారావు, విద్యార్థులు, గైడ్ టీచర్లు పాల్గొన్నారు.


