అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అర్హులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలి

Sep 19 2026 9:02 AM | Updated on Sep 19 2026 9:02 AM

అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు

నిజామాబాద్‌ రూరల్‌: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ప్రోత్సాహకాలు అర్హులకు అందేలా చూడాలని అడిషనల్‌ కలెక్టర్‌ భుజంగరావు అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని వినాయక్‌నగర్‌లోని హనుమాన్‌ జంక్షన్‌ వద్ద మహనీయుల పార్క్‌లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అడిషనల్‌ కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. వెదురు ఆధారిత వృత్తులపై ఆధారపడిన మేదర వృత్తిదారుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సాయికుమార్‌, దర్శనం దేవేందర్‌, జిల్లా మేదర అధ్యక్షులు సురునీడ పోషాద్రి, జిల్లా ప్రధాన కార్యదర్శి బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్‌, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement