వేల్పూర్: భూభారతి రీసర్వేకు గ్రామస్తులు సహకరించాలని జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు కోరారు. వేల్పూర్ మండలం వాడి గ్రామంలో భూభారతి రీసర్వేపై శుక్రవారం గ్రామస్తులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. భూభారతి రీసర్వేలో సర్వేయర్లు గ్రామంలోని రైతులందరి భూములు కొలతలు చేస్తారన్నారు. సర్వేయర్లు కొలతలు చేసేటప్పుడు రైతులు తమ భూమలు హద్దులు సక్రమంగా చూయించి సహకరించాలని కోరారు. సమావేశంలో సర్పంచ్ గోలి రమ్య, ఉపసర్పంచ్ గోలి లింబాద్రి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బద్దం మహేందర్, జీపీవో మోహన్, సర్వేయర్లు శేఖర్‌వర్మ, శశికుమార్, తులూష, సీసీ ప్రతాప్‌కుమార్, వీడీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.


