గాంధారి: పత్తి చేనులో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్న నిందితులను అరెస్టు చేసినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు శుక్రవారం తెలిపారు. మండల పరిధిలోని నేరల్ తండా, గొల్లాడి తండాకు చెందిన మంజా సోమసింగ్, మంజా మద్ది బాయి లు గాంధారి గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. అయితే పత్తి పంటలో అంతర పంటగ గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు సీఐ వీరయ్య ఆధ్వర్యంలో గాంధారి ఎస్సై మహేందర్ సిబ్బందితో దాడి చేసి గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ధ్వంసం చేసిన గంజాయి మొక్కల విలువ రూ.12 లక్షలు ఉంటుందని అన్నారు. పోలీసులు, సిబ్బంది ఉన్నారు.


