మూడేళ్లు అవుతున్నా నిధులు రాలే.. | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లు అవుతున్నా నిధులు రాలే..

Sep 19 2026 8:56 AM | Updated on Sep 19 2026 8:56 AM

మూడేళ్లు అవుతున్నా నిధులు రాలే..

అసెంబ్లీలో అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌

సుభాష్‌నగర్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా ప్రత్యేక నిధులు విడుదల కాలేదని అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌పై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రికి మూడు సార్లు లేఖలు ఇచ్చినా స్పష్టత లేదన్నారు. నిజామాబాద్‌ బస్టాండ్‌, అభివృద్ధిపై మంత్రి, సహా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయిందని విమర్శించారు. ఇక జీజీహెచ్‌ ప్రభుత్వ ఆస్పత్రిపై గతంలో సమీక్షలు జరిగినా పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. 800 మంది విద్యార్థులకు ఒక బాలికల ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదన చేసినా ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement