బాన్సువాడ రూరల్: అక్టోబర్ 6న నిర్వహించే చలో హైదరాబాద్ మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభను విజయవంతం చేయాలని ఎంఎస్‌ఎఫ్ ఉమ్మడి నిజామాబాద్, మెదక్ జిల్లాల ఇన్‌చార్జి బి. శివకుమార్ కోరారు. శుక్రవారం బాన్సువాడలోని బాలుర హాస్టల్‌లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఫలాలు ప్రతి మాదిగ, ఉపకులాల విద్యార్థులు అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.నాయకులు మెక్కాసాయిలు, మావురం శ్రీకాంత్, లక్ష్మణ్, నవీన్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


