● అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి
ఆర్మూర్: నిధులు, నియామకాలు, నీళ్లు అనే మూడు అంశాల మీద కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. ఈ ఆవేదనతో మూడు నెలలు ఆలోచించే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నానని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో హవర్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని మాదాపూర్ చెరువులో నీరు లేకపోవడంతో పదివేల ఎకరాల పంట అయోమయంలో ఉందన్నారు. ఆర్మూర్ నియోజకవర్గం మీద ప్రత్యేక రివ్యూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. నందిపేట్ లో పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు ఏర్పాటు చేయాలని, పామ్ ఆయిల్ కంపెనీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.


