సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల ట్రెండ్ నడుస్తోంది. ఏఐ ఆధారిత యాప్‌లలో ఫొటోలను అప్‌లోడ్ చేస్తే చాలు 1980 నాటి ట్రెండుకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నాయి. దీంతో యువతతోపాటు పలువురు ప్రముఖులు సైతం తమ ఫొటోలను అప్‌లోడ్ చేసి వస్తున్న చిత్రాలను చూసి మురిసిపోతూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్‌రెడ్డి సైతం ఏఐ ఫొటోలను అప్పటి లుక్‌తో షేర్ చేశారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


