● సోషల్ మీడియాల్లో
వైరల్ అవుతున్న ఫొటో
● ఫేక్ అంటున్న అటవీ అధికారులు
డిచ్‌పల్లి: మండలంలోని దూస్‌గాం గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచా రం కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు మాత్రం అదంతా ఫేక్ అంటూ కొట్టిపడేస్తున్నారు. సర్పంచ్ సువర్ణ, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఐదు రోజుల క్రితం గ్రామాన్ని ఆనుకుని ఉన్న శివాలయం గుట్ట పై చిరుతను గమనించిన ఒక యువకుడు మొబైల్ ఫోన్‌లో ఫొటో తీశాడు. గ్రామంలోని వాట్సాప్ గ్రూ పుల్లో ఫొటో వైరల్ కావడంతో గురువారం సర్పంచ్, ఉప సర్పంచ్, వీడీసీ సభ్యులు యువకుడి ఇంటికి వెళ్లి ఖరారు చేసుకున్నారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించగా, వారు వచ్చి శివాలయం గుట్టపై పరిశీలించగా ఆనవాళ్లు లభించలేవు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజులుగా శివాలయంలో పూజలు సైతం నిర్వహించడం లేదు. ఈ విషయమై నిజామాబాద్ సౌత్ అటవీ అధికారిని సంప్రదించగా, చిరుత సంచారం ఆనవాళ్లు లేవని, అదంతా ఫేక్ అన్నారు. టపాకాయలు కాలుస్తూ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించినట్లు తెలిపారు.


