న్యూస్‌రీల్
నిజామాబాద్
ఫీజుల ప్రదర్శనకు ప్రయివేటు విద్యా సంస్థలు అనాసక్తి
అటవీ అమరుల త్యాగాలు..
అడవులు, వన్యప్రాణుల రక్షణకు ప్రాణాలను త్యాగం చేసిన ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది సేవలు వెలకట్టలేనివని డీఎఫ్‌వో అన్నారు.
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
– 8లో u
ఖలీల్‌వాడి: ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రయివేటు యాజమాన్యాలు తమ పాఠశాలల్లోని తరగతుల వారీగా ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగ పర్చాలని స్పష్టం చేసింది. పాఠశాల ప్రాంగణంలోని నోటీసు బోర్డుతోపాటు స్కూల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ Schooledu.telangana.gov.inలో వివరాలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. అయితే, జిల్లాలోని అత్యధిక స్కూళ్లు ఫీజుల వివరాలను ప్రదర్శించేందుకు ముందుకు రావడం లేదు. దీంతో వివరాలు పొందుపర్చని స్కూళ్లపై కొరఢా ఝులిపించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది.
ఫిర్యాదు చేసే అవకాశం..
తల్లిదండ్రులు తమ పిల్లల ఫీజులు, ఇతర సమస్యలపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు పోర్టల్ ఉపయోగపడనున్నది. సమస్యలు, ఫిర్యాదులను అధికారిక వెబ్‌సైట్ లో మొబైల్ నంబర్ ద్వారా సమర్పించాలి. ఫిర్యాదుతోపాటు తగిన ఆధారాలను జతచేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు ఫిర్యాదును పరిశీలించి అవసరమైతే పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీచేస్తారు. తదనంతరం స్కూల్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
కారణాలు ఇవేనా?
జిల్లాలోని పలు ప్రయివేటు పాఠశాలలు తోక పేర్లతో రూ. 40 వేల నుంచి రూ. లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా లోని నాలుగైదు స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అనుమతి ఉండగా, చాలా స్కూళ్లు అనుమతి లేకుండానే కొనసాగిస్తున్నారు. దీంతో పోర్టల్‌లో ఫీజుల వివరాలు నమోదు చేయడం లేదనే చర్చ జరుగుతోంది.
పాఠశాలల ఫీజుల వివరాలను బహిర్గతం చేసేందుకు ప్రయివేటు విద్యా సంస్థలు వెనకడుగు వేస్తున్నాయి. ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, పారదర్శకతను పెంచేందుకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లాలోని పలు స్కూళ్లు వివరాల వెల్లడికి ఆసక్తి చూపడం లేదు.
నోటీసులకు సన్నాహాలు..
ప్రయివేటు పాఠశాలల్లో ఫీజుల పేరుతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతోందని ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. స్కూల్ ఫీజుతోపాటు వివి ధ రకాల పేర్లతో యాజమాన్యాలు అదనపు రు సుములు వసూలు చేస్తున్నాయని, ముందస్తుగా భారీ మొత్తాలను చెల్లించాలని ఒత్తిడి చేయ డంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పా ఠ్య పుస్తకాలు, నోట్‌బుక్‌లు, యూనిఫాం, షూ, ఇతర విద్యా సామగ్రి తాము సూచించిన దుకా ణాల్లో కొనుగోలు చేయాలని ప్రయివేటు స్కూళ్ల నిర్వాహకులు ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ప్రయివేటు విద్యాసంస్థల ఆగడాలకు చెక్‌పెట్టేలా ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్ విధానం తీసుకొచ్చింది. అయితే, పోర్టల్‌లో ఫీజుల వివరాలను పొందుపర్చేందుకు పలు ప్రయివేటు స్కూళ్లు ముందుకు రావడం లేదు. జిల్లాలో మొత్తం 588 ప్రయివేటు స్కూళ్లు ఉండగా, అందులో 83 స్కూ ళ్లు మాత్రమే పోర్టల్‌లో ఫీజుల వివరాలను డిస్‌ప్లే చేశారు. మిగితా 505 స్కూళ్లు ఫీజుల ప్రదర్శనకు దూరంగా ఉన్నాయి. దీంతో ఆ పాఠశాలలకు షో కాజ్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా విద్యా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నోటీసులకూ స్పందించని స్కూళ్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
విద్యాశాఖ ఇచ్చిన జీవో ప్రకారం ప్రయివేటు స్కూళ్లు వివరాలను పోర్టల్‌లో నమోదు తరగతుల వారిగా ఫీజు వివరాలను నోటీసు బోర్డులతోపాటు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. లేకుంటే జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలి.
– కృపాల్ సింగ్ సోడి,
జిల్లా పీఆర్టీయూ తెలంగాణ గౌరవ అధ్యక్షుడు
ఫీజు వివరాలు ప్రదర్శించాలి
పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో జిల్లాలోని 85 స్కూళ్లు మాత్రమే వివరాలు నమోదు చేశాయి. మిగతా 505 పాఠశాలలు నమోదు చేయలేదు. వీటికి నోటీసులు అందిస్తాం. నోటీసులకు జవాబుతోపాటు పోర్టల్‌లో నమోదు చేసి, ఫీజు వివరాలను ప్రదర్శించాలి. లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటాం. – పార్శి అశోక్, డీఈవో, నిజామాబాద్
జిల్లాలో మొత్తం 588 ప్రయివేటు
విద్యాసంస్థలు
ఇప్పటి వరకు పోర్టల్‌లో
నమోదు చేసుకున్నవి 83
మిగతా 505 విద్యా సంస్థలకు
జారీ కానున్న షోకాజ్ నోటీసులు


