‘సర్‌’ విచారణ వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ విచారణ వేగవంతం చేయాలి

Sep 12 2026 1:36 AM | Updated on Sep 12 2026 1:36 AM

22–ఏ ఫిర్యాదులపై సత్వరమే

స్పందించాలి

కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

తహసీల్దార్లతో సమీక్ష

నిజామాబాద్‌ అర్బన్‌: ఓటరు జాబితా ప్రత్యేక సమ గ్ర సవరణ (సర్‌)లో భాగంగా అనామలీస్‌, నో మ్యాపింగ్‌ కేటగిరీలో గుర్తించిన ప్రతి ఓటరుకు నో టీసులు అందించి, పారదర్శకంగా విచారణ నిర్వహించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. అనామలీస్‌, నో మ్యాపింగ్‌ ఓటర్ల కు నోటీసుల జారీ, వాటి పంపిణీ, విచారణ ప్రక్రియపై ఒక్కో మండలం వారీగా సమీక్షించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. నోటీసుల విచారణ ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతి కేసుకు సంబంధించిన ధ్రువపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రతిరోజూ బీఎల్‌వోలు, సూపర్‌వైజర్ల పనితీరును పర్యవేక్షించాలని తహసీల్దార్లకు సూచించారు. కాగా, 22–ఏ నిషేధిత భూ ములకు సంబంధించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యా దులు, అర్జీలపై సత్వరమే స్పందించాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. భూభారతి చట్టం మార్గ దర్శకాలను పాటిస్తూ, రెవెన్యూ రికార్డులను క్షు ణ్ణంగా పరిశీలిస్తూ అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని హితవు పలికారు. అలసత్వ వైఖరిని ప్రద ర్శిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అదనపు కలెక్టర్‌ భుజంగరావు, ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిగ్యాన్‌ మాల్వియా, నగర పాలక సంస్థ కమిషనర్‌ దిలీప్‌ కుమార్‌, డీఆర్వో గీత, ఆర్డీవోలు రాజేంద్రకుమార్‌, విజయ కుమారి, డీఆర్డీవో సాయన్న, డీఎస్‌వో శ్రీకాంత్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ డీఎం ప్రవీ ణ్‌, డీసీవో శ్రీనివాస్‌, డీఏవో వీరాస్వామి, మార్కెటింగ్‌ శాఖ అధికారి గంగుబాయి పాల్గొన్నారు.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులు పండించి న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నా రు. వరి ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో శుక్రవారం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్‌ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అక్టోబర్‌ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తేస్తామన్నారు. ఈ సారి సుమారు 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధా న్యం కొనుగోలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటిలో ఐకేపీ ద్వారా 249 కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యాన్ని నిల్వ చేసేందుకు వీలుగా గిడ్డంగులను గుర్తించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement