నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

బోధన్‌రూరల్‌: నేరాల నియంత్రణపై పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్‌ కమిషనర్‌ పి సాయిచైతన్య అన్నారు. బోధనన్‌ డివిజన్‌ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్‌ కేసుల పురోగతిపై సర్కిల్‌ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్‌, గంజాయి రవాణాను నివారించేందుకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని, అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు బాధితులకు తక్షణ సహాయం అందించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీషీటర్లు, బెయిల్‌పై ఉన్న నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బ్లాక్‌స్పాట్లను గుర్తించి సైన్‌న్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలకు అనుసంధానంగా ఉన్న లింక్‌ రోడ్ల వద్ద స్పీడ్‌ బ్రేకర్లు, రోడ్డు పక్కన పొదల తొలగింపు వంటి చర్యలు చేపట్టాలన్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, ఓవర్‌స్పీడ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, మైనర్‌ డ్రైవింగ్‌ను నివారించేందుకు ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. పండుగల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 24 గంటలపాటు వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. సమావేశంలో బోధన్‌న్‌ ఏసీపీ పి శ్రీనివాస్‌, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement