● తపాలా శాఖ ఆధ్వర్యంలో
6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు..
● విజేతలకు ఏడాదికి
రూ.6వేల స్కాలర్‌షిప్
నిజామాబాద్ రూరల్ : తపాలా శాఖ ఆధ్వ ర్యంలో 6 నుంచి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు దీన్ దయాళ్ స్పర్శ్ యోజన క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘అభిరుచులలో ఫిలాట లి రారాజు’’ స్టాంపుల సేకరణ అభిరుచిపై రీజినల్ స్థాయి క్విజ్ పోటీలు ఉంటాయన్నా రు. పోటీల్లో పాల్గొనాలనుకునే విద్యార్థికి ‘‘ఫిలాటలి డిపాజిట్ ఖాతా’’ తప్పనిసరిగా పొంది ఉండాలని, గెలుపొందిన విద్యార్థు లు ‘‘ఫిలాటలి ప్రాజెక్టు వర్క్’’ సమర్పించా ల్సి ఉంటుందని తెలిపారు. విజేతలకు సంవత్సరానికి రూ.6 వేల స్కాలర్‌షిప్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 21వ తే దీలోపు సమీపంలోని పోస్టాఫీసులో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు.
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణురాజ్
ఖలీల్‌వాడి: ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నిజామాబాద్ నగరానికి చెందిన వరదబట్టు వేణురాజ్‌ను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వేణురాజ్‌ను రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించిన జాతీయ, రాష్ట్ర కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా
వెంకటేశ్‌గౌడ్
భిక్కనూరు: ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన జేపీ వెంకటేశ్‌గౌడ్ నియామకం అయ్యారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యాడవల్లి వెంకటస్వామి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో నియామకానికి కృషి చేసిన ప్ర భుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, రాష్ట్ర యు వజన కాంగ్రెస్ నాయకుడు ఇలియాస్, రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజ లందరికీ వివరించడంతోపాటు కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈవీఎం గోదాం పరిశీలన
నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలోని వి నాయకనగర్‌లో ఉన్న ఈవీఎం గోదామును అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదాము సీల్‌ను తెరిపించి ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదుల ను క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, ఇతర సామగ్రికి ఎ లాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని అధికారులను ఆదేశించారు. క లెక్టర్ వెంట అగ్నిమాపక శాఖ అధికారి శంక ర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరా జ్, సిబ్బంది సాత్విక్, విజయేందర్, ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఖలీల్‌వాడి : జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతుల్లో (2027–28 వి ద్యా సంవత్సరం) ఖాళీ ఉన్న సీట్లను భర్తీ చే సేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కు చెందిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన విద్యార్థులు ఎటువంటి దరఖాస్తు రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో ఈనెల 30వ తేదీ వరకు https:// cbseitims.nic. in/2026/nvsi ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎల్‌ఈఎస్‌టీ– 2027లో ఎంపికైన విద్యార్థులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యనభ్యసించేందుకు అర్హ త సాధిస్తారని తెలిపారు.


