పుష్కరాల సందర్భంగా జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి ప్రాంతానికి మెరుగులు దిద్ది మ రింత శోభాయమానంగా తీర్చిదిద్దనున్నారు. గో దావరి, మంజీర, హరిద్రా నదుల త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రానికి భారీ సంఖ్య లో భక్తులు తరలివచ్చే అవకా శం ఉంది. ఇక్కడ పుష్కర ఘాట్‌ల నిర్మాణం, రహదారుల నిర్మా ణం తదితర అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. కందకుర్తిలో గతంలో నిర్మించిన మూడు పు ష్కరఘాట్‌లకు మరమ్మతులతోపాటు అదనంగా స్నానఘాట్‌లను నిర్మించనున్నారు. రూ. 6.05 కోట్లతో పుష్కరఘాట్ల నిర్మాణం చేపట్టనుండ గా, రోడ్ల అభివృద్ధికి రూ.3.90 కోట్లు వెచ్చించ నున్నారు. మరో రూ.5 కోట్లతో పురాతన శివాలయం అభివృద్ధి, సుందరీకరణ పనులను చేపట్టనున్నారు.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : గోదావరి పుష్కరాల కు విస్త్రృత ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు గోదావరి పుష్కరాలను నిర్వహించ నున్నారు. అలాగే జూలై 13 నుంచి 24 వరకు అంత్య పుష్కరాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో లక్షల సంఖ్యలో హాజరయ్యేభక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో పుష్కర ఘాట్ ల నిర్మాణం, ఘాట్‌లకు చేరేందుకు రహదారుల నిర్మాణం, టాయిలెట్లు తదితర ఏర్పాట్లు చేసేందుకు అవసరమైన పనులు మొదలుకానున్నాయి.
జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాల్లో భక్తుల కోసం విస్త్రృతంగా ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తితోపాటు తాడ్‌బిలోలి వద్ద స్నాన ఘాట్‌ల నిర్మాణం చేపడతారు. నవీపేట మండలం యంచ వద్ద స్నానఘాట్‌లతోపాటు తీరం వరకు చేరుకునేలా రహదారుల అభివృద్ధి, మహిళలకు డ్రెస్సింగ్ రూమ్‌ల, మొబైల్ టాయిలెట్స్, తాగునీరు, 24 గంటలపాటు వైద్యసేవల సౌకర్యాలను కల్పించనున్నారు. అన్ని చోట్ల భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించనున్నారు.
పనుల నాణ్యతే కీలకం
పుష్కరాల ఏర్పాట్ల కోసం చేపడుతున్న పనుల ను శాశ్వత ప్రాతిపదికన చేస్తున్నట్టు చెబుతు న్నా నాణ్యత విషయంలో ఎక్కువగా తాత్కాలి క పనులకే పరిమితమవుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి చేపట్టే పనులు నాణ్యతగా చేపట్టాల్సి ఉంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈసారి కొత్తగా ఘా ట్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం పాత ఘాట్‌ల అభివృద్ధికే మొగ్గుచూపుతోంది. గోదావరి తీర ప్రాంతాలైన కోస్లి, బినోల, తుంగిని, తడ్‌పాకల్, ఉమ్మెడ తదితర ప్రాంతాల్లో నూ కొత్తగా ఘాట్‌ల నిర్మాణం చేపడితేనే విపరీతమైన రద్దీ, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు
కందకుర్తి వద్ద రూ. 30 కోట్లతో పనులు
యంచలో ఘాట్‌ల నిర్మాణానికి
రూ. 2.15 కోట్లు
వచ్చే ఏడాది జూన్ 26 నుంచి
గోదావరి పుష్కరాలు
కుంభమేళాను తలపించనున్న
గోదావరి తీర ప్రాంతాలు


