ఖలీల్‌వాడి: నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలోని పాఠశాలను తనిఖీ చేసిన బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్‌పర్సన్ కే సీతాదయాక్‌రెడ్డి, సభ్యులు అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశంలో కమిటీ సభ్యులు వందనగౌడ్, చందన, బండి అపర్ణ, సరిత, ప్రేమలత అగర్వాల్, పవన్‌కుమార్ తోపాటు అధికారులు పాల్గొన్నారు. మూడు జిల్లాల్లోని కేజీబీవీలు, ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్‌లలో పరిస్థితులపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల స్థితిగతులు, పాఠశాలల్లోని మౌలిక వసతులపై అధికారులతో చర్చించారు. సమస్యలపై ప్రభుత్వానికి నివేదిస్తామని చైర్‌పర్సన్ అన్నారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


