రైస్‌ మిల్లులపై అధికారుల దాడులు ఆపాలి | - | Sakshi
Sakshi News home page

రైస్‌ మిల్లులపై అధికారుల దాడులు ఆపాలి

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

బోధన్‌: రైస్‌ మిల్లులపై విజిలెన్స్‌ అధికారుల దాడులు, కేసుల నమోదు తక్షణమే నిలిపివేయాలని తాలూకా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. రైస్‌ మిల్లులపై అధికారుల దాడులకు నిరసనగా బుధవారం పట్టణ కేంద్రంలోని పెద్ద హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైస్‌మిల్లులను బంద్‌పాటించారు. అనంతరం వారు మాట్లాడుతూ. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయడం లేదన్నారు. రైస్‌మిల్లులపై విజిలెన్స్‌ దాడులు, కేసుల నమోదుతో తమ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం రైస్‌మిల్లులకు అప్పగించిన తరహాలోనే వెంటనే మిల్లింగ్‌ చేసిన బియ్యం గోదాంలకు తరలించాలని తెలిపారు. డివిజన్‌ పరిధిలోని 56 రైస్‌ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు రైస్‌మిల్లుల బంద్‌ను కొనసాగిస్తామని రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తెలిపారు. తాలూకా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాంబిరెడ్డి, ప్రతినిధులు బోనాల బలరాంరెడ్డి, శ్యామ్‌కుమార్‌, ఇనాని, నాగరాజు, సచిన్‌, శ్రీహరి, అశోక్‌, శ్రీనివాస్‌, అరవింద్‌ ఇనాని, సాయి కుషాల్‌, నరేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement