● నాలుగు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్‌పల్లి శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం వేకువ జామున హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో ఆ దారిలో నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానిక పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి క్రేన్ సహాయంతో బోల్తాపడ్డ లారీని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ని తొలగించారు. వాన నీరు వెళ్లేందుకు రహదారిపై టోల్‌ప్లాజా యాజమాన్యం తవ్విన గుంత వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా రోడ్డుని మళ్లించడంతో రాత్రి వేళల్లో వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారని తెలిపారు. ప్రమాదంలో లారీ డ్రైవర్‌కి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు టోల్ ప్లాజా సిబ్బంది తెలిపారు.


