ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడి ఆత్మహత్య

Sep 10 2026 1:39 AM | Updated on Sep 10 2026 1:39 AM

ప్రేమించిన అమ్మాయి దక్కలేదని యువకుడి ఆత్మహత్య

ధర్పల్లి: తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందన్న విషయాన్ని తట్టుకోలేక, మనస్తాపానికి గురైన ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ధర్పల్లి మండలం మరియా తండాలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మరియా తండాకు చెందిన బనావత్‌ విజయ్‌ కుమార్‌ (22) కొన్నేళ్లుగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. సదరు అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. విషయం తెలుసుకున్న విజయ్‌ తీవ్ర మనస్థాపానికి గురై మూడు రోజుల క్రితం ఆవేదనతో సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన మనసులోని బాధను వ్యక్తం చేశాడు. తాను ప్రేమించిన అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేయకండి.. మేమిద్దరం ప్రేమించుకున్నాం.. ప్లీజ్‌ నాకు ఇచ్చి పెళ్లి చేయండి.. అమ్మ నాన్న క్షమించండి అంటూ వీడియో చివరిలో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సీతారాం ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement