● కేసీఆర్‌కు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది
● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊ బిలోకి నెట్టిందే బీఆర్‌ఎస్ ప్రభుత్వమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మట్లా డారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజలకు శుభకాంక్షలు తెలిపారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడి నాయకులు తెలంగాణను దోచుకున్నారని మండిపడ్డారు. కమీషన్లు పంచుకునేటప్పుడు తేడాలు రావడంతోనే కవిత బీఆర్‌ఎస్ ను వీడారని అన్నారు. కేసీఆర్‌కు ఆడబిడ్డ కవిత ఉ సురు తగులుతుందన్నారు. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. అసెంబ్లీకి రా కుంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీ జేపీ మతత్వ పార్టీ అని ఎన్నికలు రాగానే రాముని పేరు చేప్పి ఓట్లు దండుకోవాలని చూస్తారన్నారు. కార్పొరేషన్ డీసీసీ చైర్మన్ బొబ్బిలి రామకృష్ణ, క ల్లుగీత కార్మిక ఆర్థిక సంఘం ప్రణాళిక చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, శరత్, అంతిరెడ్డి రాజిరెడ్డి, రమేశ్‌రెడ్డి, గోపి, రవి, ప్రవీణ్ గౌడ్, రాజప్రసాద్, ఐసీడీఎంఎస్ మాజీ చైర్మన్ తారాచంద్ నాయక్, యాదగిరి, భక్తవత్సలం, వైశాక్షి సంతోష్, జావిద్ అక్రమ్, రేవతి, విపుల్ గౌడ్, రాజేంద్రప్రసాద్, సర్ధార్ నరేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.


