అమరవీరుల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డుల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డుల పంపిణీ

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

అమరవీరుల కుటుంబాలకు ఫ్యామిలీ కార్డుల పంపిణీ వివాహిత ఆత్మహత్య ఇద్దరిపై కత్తితో దాడి

నిజామాబాద్‌ అర్బన్‌: పోలీస్‌ అమరవీరుల కుటుంబాలకు టీజీ వీర్‌ ఫ్యామిలీ కార్డులను సీపీ సాయి చైతన్య మంగళవారం పంపిణీ చేశారు. గతంలో జిల్లా నుంచి నక్సలైట్ల కాల్పుల్లో 14 మంది పోలీసులు మరణించారని వీరి కుటుంబాలకు సీపీ ఫ్యామిలీ కార్డులను అందించారు. కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులు ఉన్నారు.

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండ మండల కేంద్రంలోని ఆర్మూర్‌గల్లి ఏరియాకు చెందిన పిట్ల ఉమారాణి(21) కుటుంబ కలహాలతో మంగళవారం తల్లిగారి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

నిజామాబాద్‌ అర్బన్‌: వర్ని చౌరస్తాలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. రెండో టౌన్‌ ఎస్సై యాదగిరి గౌడ్‌ మంగళవారం తెలిపిన వివరాలప్రకారం.. మాధవనగర్‌కు చెందిన జాదవ్‌ గణేశ్‌ అతని స్నేహితుడు ఆదిత్య ఇద్దరు ఆటోలో వర్ని చౌరస్తాకు వచ్చా రు. అక్కడ లక్కె నవీన్‌ అనే వ్యక్తి పాత కక్షలతో గ ణేశ్‌ పై కత్తితో దాడి చేశారు. వీపులో కత్తితో పొడవు గా అతని స్నేహితుడు ఆదిత్య అడ్డుకునే ప్రయత్నం చేయగా అతని చాతిపై సైతం నిందితుడు పొడిచా డు. ఈ ఘటనపై గణేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చే యగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు న వీన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement