● బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్
బోధన్: కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాల న వైఫల్యాలను ప్రజలు ప్రశ్నించాలని, ఎన్నిక ల్లో అనేక వాగ్ధానాలు చేసి వాటిని అమలు చేయ కుండా ప్రజలను మోసం చేసిందని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ అన్నారు. పట్టణ కేంద్రంలోని ఆయన స్వగృహంలో పార్టీ పట్టణ, మండల ప్రతినిధులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నా రు. మూడేళ్ల పాలనలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి అధోగతి పాలైందని అన్నారు. తెలంగాణ రక్షణ సమితి వ్యవస్థా పక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బోధన్ నియోజకవర్గంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని ఆయన అన్నారు. కవిత బీఆర్‌ఎస్ మా జీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేల పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మా నాయకుడు కేసీఆర్, బీఆర్‌ఎస్‌కు కట్టుబడి ఉంటామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు రవీంద్ర యాదవ్, మండలాల అధ్యక్షులు సంజీవ్, గోగి నేని నర్సయ్య, భూంరెడ్డి, దేరడి శ్రీరాం, నర్సింగ్‌రావు, కౌన్సిలర్ గుమ్ముల అశోక్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.


