వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలి

Sep 4 2026 7:41 AM | Updated on Sep 4 2026 7:41 AM

వెయ్యి రోజుల పాలనలో ఏం చేశారో చెప్పాలి

ఆర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌టౌన్‌: రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఖజానాకు కన్నం వేయడం, పాతగోడలకు సున్నం వేయ డం తప్ప ఈ వెయ్యి రోజుల పాలనలో ఏం చే శారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఆ ర్మూర్‌ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి డిమాండ్‌ చే శారు. ఆర్మూర్‌ సిద్ధుల గుట్ట శివయ్య సాక్షిగా ఎ న్నికల హామీలు అమలు చేస్తానని నాడు ఒట్టు పెట్టిన సీఎం రేవంత్‌ రెడ్డి ఆరు గ్యారెంటీలను, 420 హామీలను గాలికి వదిలేశారని అన్నారు. నవనాథ సిద్ధుల గుట్టపై నిర్వహించిన విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన హామీల అమలు జరిగేంతవరకు బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టి న పోరు ఆగదన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్లు పృథ్వీరాజ్‌, నయీమ్‌, మాజీ ద్‌, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement