మోపాల్: మండలంలోని ముదక్‌పల్లి ఫారెస్ట్ సౌత్ బీట్ పరిధిలో ఉన్న కంపార్ట్‌మెంట్ నంబర్ 159 శివారు ప్రాంతాల్లో చెట్లను అనధికారికంగా నరికేసిన పలువురిపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సౌత్ ఎఫ్‌ఆర్‌వో రవిమోహన్ భట్ మంగళవారం తెలిపారు. రామేశ్‌పూర్ తండా (శివలాల్ తండా)కు చెందిన కేతావత్ సరియ, కేతావత్ పీక, కేతావత్ లక్ష్మణ్, కేతావత్ రాము, గుగులోత్ రమేశ్, నేనవత్ నరేందర్‌తోపాటు ఇతరులు చెట్లు నరికినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ముదక్‌పల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ బాసిత్, బీట్ ఆఫీసర్ సయ్యద్ సాబేర్ చెట్లు నరికేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించి నివేదికను అందజేశారని, ఆ నివేదిక ఆధారంగా వారిపై కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీరిపై అటవీ చట్టాలు, సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని పాతకలెక్టరేట్ మైదానంలో సోమవారం తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కవిత సభ నిర్వహించారు. ఇందులో వేలాది మంది పాల్గొన్నారు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇద్దరు వ్యక్తుల నుంచి బంగారు చైన్‌లను దొంగిలించారు. ఒక వ్యక్తికి చెందిన రెండు తు లాల బంగారు, మరో వ్యక్తికి చెందిన మూడు తులా ల బంగారు చైన్‌లు చోరీకి గురైనట్లు ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
కలప స్వాధీనం
సిరికొండ: భీమ్‌గల్ మండలంలోని ముచ్కూర్ గ్రా మంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలపను స్వాధీనం చేసుకున్నట్లు సిరికొండ ఎఫ్‌ఆర్‌వో న ర్సింగ్‌రావు మంగళవారం తెలిపారు. కలప వ్యాపా రం నిర్వహించే కొయ్యాడ చిన్న కిష్టాగౌడ్ వద్ద అ క్రమ టేకు కలప ఉందనే సమాచారం మేరకు దాడి చేశామన్నారు. ఇందులో రూ.1,11,805 విలువ చేసే కలపను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌వో తెలిపారు.


