నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని మిర్చికంపౌండ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఒకటో టౌన్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. మిర్చికంపౌండ్‌లో న్యూపాపులర్ ట్రాన్స్‌ఫోర్టు నుంచి 400 బ్యాగులు 100 క్వింటాళ్ల రేషన్ బియ్యానిన మహారాష్ట్రకు తరలిస్తున్నారనే సమాచారం రావడంతో దాడిచేసి పట్టుకున్నట్లు ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో రఘుపతి తెలిపారు. ట్రాన్స్‌ఫోర్టు యజమాని జానీపాషా, అబ్దుల్ లతీఫ్‌లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు.
నందిపేట్‌లో 22.60 క్వింటాళ్లు..
నందిపేట్: మంల కేంద్రం నుంచి అక్రమంగా తరలిస్తున్న 22.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని నందిపేట్ పోలీసులు పట్టుకున్నారు. నందిపేట పీఎస్ పరిధి లోని రైతు ఫారం గ్రామ శివారులో ఎస్సై వినయ్ వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో బొలెరో వాహనంలో 22.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. డ్రైవర్ సయ్యద్ అన్సార్, ఎండీ మోసిన్, చోటు, వా హన యజమా ని భైంసా పట్టణానికి చెందిన మహమ్మద్ ఖురేషిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


